ఆసీస్‌ అద్భుతం

6 Aug, 2019 09:35 IST|Sakshi

యాషెస్‌ తొలి టెస్టులో 251 పరుగులతో ఘనవిజయం

లయన్‌ మాయాజాలం ∙కుప్పకూలిన ఇంగ్లండ్‌

తొలిరోజు ఆటలో టీ బ్రేక్‌కు ముందు ఆస్ట్రేలియా స్కోరు 122/8. ఈ స్కోరుతో ఆసీస్‌ ఎంత ఘోరంగా ఓడుతుందో అనే అనుకున్నారంతా! అలాంటి జట్టు ఏకంగా 251 పరుగుల తేడాతో గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. అలా అనుకున్నది తలకిందులు చేసిన ఆసీస్‌ ఊహకందని విజయంతో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో బోణీ చేసింది. 

బర్మింగ్‌హామ్‌: యాషెస్‌ సిరీస్‌ ఇంగ్లండ్‌లోనే జరుగుతున్నా ... తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండే జోరు మీదున్నా... చివరకు బోణీ చేసింది మాత్రం ఆస్ట్రేలియానే. తొలి టెస్టులో ఆఖరి ఆటలో లయన్‌ (6/49) స్పిన్‌ పడింది. దీంతో ఇంగ్లండ్‌ డీలా పడింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్‌ 1–0తో దూసుకెళ్లింది. తొలి సమరంలో ఆస్ట్రేలియా పోరాటమే గెలిచింది. 251 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌ లో స్పిన్నర్‌ లయన్‌ మొత్తం 9 వికెట్లు తీయగా, రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించిన స్మిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అ వార్డు దక్కింది. రెండో టెస్టు లార్డ్స్‌లో 14న మొదలవుతుంది. 

భళారే విచిత్రం...
తొలిరోజున ఓ దశలో ఆసీస్‌ స్కోరు 122/8. ఆఖరి రోజు ఇంగ్లండ్‌ స్కోరు 136/9. దిక్కుతోచని స్థితి నుంచి శాసించే దశకు ఆస్ట్రేలియా చేరుకుంటే... మూడు రోజులు పైచేయి సాధించిన ఇంగ్లండ్‌ చిత్తుగా ఓడింది. 398 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్‌ స్కోరు 13/0తో సోమవారం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ ఓటమి గే(బ్యా)ట్లెత్తింది. ఇన్నింగ్స్‌ పదో ఓవర్‌తో ఇంగ్లండ్‌ పతనం ఆరంభమైంది. కమిన్స్‌ బౌలింగ్‌లో ముందుగా బర్న్స్‌ (11) వికెట్‌ పడింది. రెండో వికెట్‌కు 41 పరుగులు జతచేశాక ఇదే ఇన్నింగ్స్‌కు పెద్ద భాగస్వామ్యమవుతుందని బహుశా ఎవరూ అనుకోలేదు. రూట్‌ (28; 3 ఫోర్లు)తో జతకలిసిన రాయ్‌ (28; 4 ఫోర్లు)ను లయన్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో అతని స్పిన్‌ సుడిలో ఇంగ్లండ్‌ చిక్కుకుంది. 

లయన్‌ స్పిన్‌ ఉచ్చులో...
జట్టు స్కోరు 80 పరుగుల వద్ద లయన్‌ స్పిన్‌ మాయాజాలానికి జో డెన్లీ (11) మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. మరో 5 పరుగులకే రూట్‌ కూడా ఔటయ్యాడు. 85/4 స్కోరు వద్ద ఇంగ్లండ్‌ లంచ్‌కెళ్లింది. రెండో సెషనులో ఇంగ్లండ్‌ పతనానికి అడ్డుఅదుపు లేకుండా పోయింది. లయన్, కమిన్స్‌ చకచకా వికెట్లు తీశారు. బట్లర్‌ (1), స్టోక్స్‌ (6), బెయిర్‌స్టో (6) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో కేవలం 12 పరుగుల వ్యవధిలో 3 వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్‌ స్కోరు 97/7. ఘోర పరాజయానికి మూడే వికెట్ల దూరంలో నిలిచింది. టెయిలెండర్‌ వోక్స్‌ (37; 7 ఫోర్లు) ఇన్నింగ్స్‌ టాప్‌స్కోరర్‌గా నిలువడంతో రూట్‌ సేన రెండో ఇన్నింగ్స్‌లో 52.4 ఓవర్లలో 146 పరుగుల వద్ద ఆలౌటైంది. కమిన్స్‌ 4 వికెట్లు తీశాడు. 

5 రోజులు ఆడిన ‘టెన్త్‌’ ప్లేయర్‌ బర్న్స్‌...
టెస్టు ఐదురోజులైతే అన్ని రోజులు బ్యాటింగ్‌ చేసిన తొలి ఆటగాడు భారత దిగ్గజం, హైదరాబాదీ ఎం.ఎల్‌.జయసింహా (1960) కాగా... పదో క్రికెటర్‌ బర్న్స్‌. ఈ జాబితాలో మరో ఇద్దరు భారత ఆటగాళ్లు రవిశాస్త్రి (1984), పుజారా (2017) ఉన్నారు. ఇంగ్లండ్‌ పరంగా చూస్తే నాలుగో ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మన్‌ బర్న్స్‌. ఈ వరుసలో బాయ్‌కాట్‌ (1977), ల్యాంబ్‌ (1984), ఫ్లింటాఫ్‌ (2006) ముందున్నారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జైపూర్‌ జోరుకు బ్రేక్‌

ఓవరాల్‌ చాంప్‌ సిద్ధార్థ డిగ్రీ కాలేజి

స్టెయిన్‌ ‘టెస్టు’ ముగిసింది!

సింధు, సైనాలకు ‘బై’

సాకేత్‌ పునరాగమనం

వెటోరి జెర్సీకి కివీస్‌ గుడ్‌బై

మార్పులు చేర్పులతో...

చిత్తుగా ఓడిన ఇంగ్లండ్‌

యువరాజ్‌ స్టన్నింగ్‌ క్యాచ్ చూశారా?

అరంగేట్రంలోనే డిమెరిట్‌ పాయింట్‌

ఆ జెర్సీ నంబర్‌కు రిటైర్మెంట్‌

మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: అక్తర్‌

స్టీవ్‌ స్మిత్‌ మరో రికార్డు

సర్ఫరాజ్‌ను తీసేయండి.. నన్ను కొనసాగించండి!

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

యువరాజ్‌ రిటైర్డ్‌ హర్ట్‌

నా పెళ్లికి వారిని ఆహ్వానిస్తా: పాక్‌ క్రికెటర్‌

పంత్‌ భళా.. అచ్చం ధోనిలానే!

కోహ్లిని దాటేశాడు..!

విజేత ప్రణవ్‌

రన్నరప్‌ సౌజన్య జోడీ

విజేతలు విష్ణు, దియా

తను అద్భుతం చేశాడు: కోహ్లి

సాకేత్‌ జంటకు టైటిల్‌

వినేశ్‌ ఫొగాట్‌ హ్యాట్రిక్‌

మెరిసిన భారత రెజ్లర్లు

హామిల్టన్‌ హవా

తమిళ్‌ తలైవాస్‌ విజయం

ఇంగ్లండ్‌ లక్ష్యం 398

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరువాత ఆ డైరెక్టర్‌తో!

చట్రంలో చిక్కిపోతున్నారు!

షూటింగ్‌ సమయంలో కలుసుకునే వాళ్ళం..

వెబ్‌ సిరీస్‌కు ఓకే చెప్పిన అక్షరహాసన్‌

సరైనోడు వీడే

ప్రయాణం మొదలైంది