చిత్తుగా ఓడిన ఇంగ్లండ్‌

5 Aug, 2019 20:24 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌: యాషెస్‌ తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై 251 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీషు టీమ్‌ 52.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్‌ బౌలర్లు నాథన్‌ లయన్‌, కమిన్స్‌ ధాటికి ఇంగ్లండ్‌ ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 38 పరుగులు చేసిన వోక్స్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. జేసన్‌ రాయ్‌(28), జోయ్‌ రూట్‌(28), బర్న్‌(11), డెన్లీ(11) మాత్రమే రెండంకెల స్కోరు సాధించగలిగారు. బ్రాడ్‌ డకౌట్‌ కాగా, మిగతా ఆటగాళ్లు సింగిల్‌ నంబర్‌ స్కోరుకే పరిమితమయ్యారు. లయన్‌ 6, కమిన్స్‌ 4 వికెట్లు పడగొట్టారు.

తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 284, ఇంగ్లండ్‌ 374 పరుగులు చేశాయి. ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌ను 112 ఓవర్లలో 487/7 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. (చదవండి: స్టీవ్‌ స్మిత్‌ మరో రికార్డు)

>
మరిన్ని వార్తలు