ఆసీస్‌దే యాషెస్‌

9 Sep, 2019 05:34 IST|Sakshi

నాలుగో టెస్టులో 185 పరుగులతో విజయం

పోరాడి ఓడిన ఇంగ్లండ్‌

మాంచెస్టర్‌: క్రీజులో దిగిన ప్రతి బ్యాట్స్‌మన్‌ ప్రతిఘటించినా యాషెస్‌ నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. ఆదివారం ఇక్కడ ముగిసిన ఈ మ్యాచ్‌లో 383 పరుగుల భారీ లక్ష్యానికి గాను ఓవర్‌నైట్‌ స్కోరు 18/2తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆతిథ్య జట్టు 197 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఇంగ్లండ్‌ ఏమీ అంత తేలిగ్గా తలొంచలేదు. ప్రత్యర్థి పేసర్ల ధాటిని తట్టుకుంటూ ఆ జట్టు గట్టి పోరాటమే చేసింది.

ఈ క్రమంలో ఓపెనర్‌ జాన్‌ డెన్లీ (123 బంతుల్లో 53; 6 ఫోర్లు), జేసన్‌ రాయ్‌ (67 బంతుల్లో 31) ఓవర్లను కరిగిస్తూ వచ్చారు. కానీ, రాయ్, మూడో టెస్టు హీరో బెన్‌ స్టోక్స్‌ (1)లను ఔట్‌ చేసిన కమిన్స్‌ (4/43) ఆసీస్‌కు పట్టు చిక్కేలా చేశాడు. తర్వాత డెన్లీ, బెయిర్‌ స్టో (61 బంతుల్లో 25), బట్లర్‌ (111 బంతుల్లో 34) జట్టును గట్టెక్కించేందుకు యత్నించారు. టీ విరామం తర్వాత బట్లర్, ఆర్చర్‌ (1) వెనుదిరిగినా లోయరార్డర్‌లో ఓవర్టన్‌ (105 బంతుల్లో 21), లీచ్‌ (51 బంతుల్లో 12) మరింత పట్టుదలగా ఆడి 14 ఓవర్ల పాటు నిలిచారు.

ఈ దశలో మ్యాచ్‌ ‘డ్రా’ అయ్యేలా కనిపించింది. లీచ్‌ను పార్ట్‌టైమర్‌ లబషేన్, ఓవర్టన్‌ను హాజల్‌వుడ్‌ పెవిలియన్‌ చేర్చి ఆసీస్‌ను గెలిపించారు. డబుల్‌ సెంచరీతో అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చిన స్టీవ్‌ స్మిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 2–1 ఆధిక్యంలో ఉంది. గత సిరీస్‌ను ఆ జట్టే గెల్చుకోవడంతో గురువారం నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్టులో ఓడినా గణాంకాలు 2–2తో సమం అవుతాయి. తద్వారా ట్రోఫీ కంగారూల వద్దనే ఉంటుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎవరీ బియాంక..!

భళా బియాంక!

మళ్లీ బ్రాత్‌వైట్‌ బౌలింగ్‌పై ఫిర్యాదు

‘ధోనికి గౌరవంగానే సెండాఫ్‌ ఇవ్వండి’

ఎప్పుడూ ‘టాప్‌’ మీరే కాదు బాస్‌: రబడ

ఎఫ్‌-3 రేసు: గాల్లోకి లేచి ఎగిరపడ్డ కారు

పాక్‌ క్రికెట్‌ జట్టులో కోహ్లి, ధావన్‌.. వీడియో వైరల్‌

బీసీసీఐకి బేషరతుగా క్షమాపణ!

గ్రాండ్‌స్లామ్‌ సాధించిన 19 ఏళ్ల సంచలనం

ఇంగ్లండ్‌ ఇక కష్టమే..!

దులీప్‌ ట్రోఫీ విజేత ఇండియా రెడ్‌

నాదల్‌ను ఆపతరమా!

అరెస్ట్‌ వారెంట్‌.. షమీ బెయిల్‌ ప్రయత్నాలు

టీ ‘20’ స్థానాలు ఎగబాకాడు..!

ముగాబే మృతిపై ఒలోంగా ఏమన్నాడంటే..?

‘నన్ను చిన్నచూపు చూశారు’

మన టాపార్డర్‌ సూపర్‌ కదా.. అందుకే!: యువీ

దిగ్గజాల సరసన రషీద్‌ ఖాన్‌

వార్నర్‌ రియాక్షన్‌ అదిరింది!

‘మంచి స్నేహితున్ని కోల్పోయాను’

హార్దిక్‌ ‘భారీ’ ప్రాక్టీస్‌

19వ గ్రాండ్‌స్లామ్‌పై గురి

కొడుకు కోసం.. కిక్‌ బాక్సింగ్‌ చాంపియనై..

విజేతలు పద్మశ్రీ, మనో వెంకట్‌

భారత సైక్లింగ్‌ జట్టులో తనిష్క్‌

పాక్‌ స్పిన్‌ దిగ్గజం కన్నుమూత

ఇంగ్లండ్‌ ఎదురీత: ప్రస్తుతం 200/5

మెరిసిన సామ్సన్, శార్దుల్‌

దినేశ్‌ కార్తీక్‌కు బీసీసీఐ షోకాజ్‌ నోటీసు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సినిమా సౌధానికి మేనేజర్లు పునాదిరాళ్లు

అలీ అవుట్‌.. షాక్‌లో హౌస్‌మేట్స్‌

రహస్య భేటీ

ఇల్లు.. పిల్లలు కావాలి

బిగ్‌బాస్‌.. అతను లేకుంటే షో చూడటం వేస్ట్‌!

భర్తను ఏడిపించిన ప్రియాంక చోప్రా