ఆ్రస్టేలియా ఘన విజయం

30 Dec, 2019 00:59 IST|Sakshi

ట్రాన్స్‌–టాస్మన్‌ ట్రోఫీ సొంతం

మెల్‌బోర్న్‌: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆ్రస్టేలియా 247 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. దాదాపు అసాధ్యమైన 488 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ మ్యాచ్‌ నాలుగో రోజు ఆదివారం తమ రెండో ఇన్నింగ్స్‌లో 240 పరుగులకే ఆలౌటైంది. టామ్‌ బ్లన్‌డెల్‌ (210 బంతుల్లో 121; 15 ఫోర్లు) వీరోచిత శతకం సాధించగా... ఇతర బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా విఫలమయ్యారు. ఆరంభంలోనే జేమ్స్‌ ప్యాటిన్సన్‌ 9 బంతుల వ్యవధిలో లాథమ్‌ (9), విలియమ్సన్‌ (0), టేలర్‌ (2)లను అవుట్‌ చేయడంతో కివీస్‌ ఆశలు గల్లంతయ్యాయి.

ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ లయన్‌ 4, ప్యాటిన్సన్‌ 3 వికెట్లతో ప్రత్యరి్థని దెబ్బ తీశారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 137/4తో ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా మరో 9.2 ఓవర్లు మాత్రమే ఆడింది. 5 వికెట్లకు 168 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. వాగ్నర్‌కు 3 వికెట్లు దక్కాయి. ట్రావిస్‌ హెడ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. 3 టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో నెగ్గిన ఆ్రస్టేలియా ‘ట్రాన్స్‌–టాస్మన్‌ ట్రోఫీ’ని నిలబెట్టుకుంది. ఇరు జట్ల మధ్య చివరి టెస్టు వచ్చే నెల 3 నుంచి సిడ్నీలో జరుగుతుంది.   

మరిన్ని వార్తలు