మళ్లీ ఓడిన జింబాబ్వే

7 Jul, 2018 02:10 IST|Sakshi

హరారే: సొంతగడ్డపై ముక్కోణపు టి20 టోర్నీలో జింబాబ్వేకు ఒక్క విజయం కూడా దక్కలేదు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో జింబాబ్వేను ఓడించింది. ముందుగా జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. మిరే (52 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించగా, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆండ్రూ టై (3/28) జింబాబ్వేను దెబ్బ తీశాడు.

ఆసీస్‌ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 154 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ (38 బంతుల్లో 56; 1 ఫోర్, 5 సిక్సర్లు), హెడ్‌ (42 బంతుల్లో 48; 3 ఫోర్లు) మూడో వికెట్‌కు 71 బంతుల్లోనే 103 పరుగులు జోడించారు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ మధ్య ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది.    

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా