వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: స్మిత్

10 Jul, 2017 13:08 IST|Sakshi
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: స్మిత్

సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నూతన కాంట్రాక్ట్ విధానానికి తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకారం తెలబోమని ఆ దేశ క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. కొత్త వేత న చెల్లింపు విధానంలో ఆటగాళ్లదంతా ఒకే మాటగా స్మిత్ తెలిపాడు. ఈ విషయంలో తామంతా ఐక్యంగా ముందుకు సాగుదామని పేర్కొన్న స్మిత్.. దేశంలోని క్రికెటర్లకు ఆర్థికంగా లబ్ధి చేకూరడమే తమ లక్ష్యమన్నాడు.

ఇటీవల క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతిపాదించిన కొత్త వేతన విధానాన్ని ఆసీస్ క్రికెర్లంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిలో భాగంగా జూలై 1వ తేదీ నుంచి ఆ దేశంలోని దాదాపు 230 క్రికెటర్లు నిరుద్యోగులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఆసీస్-ఎ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన సైతం రద్దయ్యింది.  దీనిపై సోమవారం ఆటగాళ్లతో సీఏ సమావేశమయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు