కొత్త జీతాల ఆఫర్ కు క్రికెటర్లు నో!

24 Jun, 2017 11:47 IST|Sakshi
కొత్త జీతాల ఆఫర్ కు క్రికెటర్లు నో!

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్(సీఏ)కు ఆ దేశ క్రికెటర్లకు మధ్య నెలకొన్న కొత్త జీతాల వివాదం ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేటట్లు కనపించడం లేదు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రతిపాదించిన కొత్త జీతాల విధానాన్ని క్రికెటర్లు మరోసారి తిరస్కరించారు. ఆ నిబంధనను ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

 

పాత నిబంధన ప్రకారం.. మ్యాచ్ ల ద్వారా సీఏ ఆర్జించే ఆదాయంలో నిర్ణీత శాతాన్ని క్రికెటర్లకు అందజేసేవారు. అయితే కొత్త విధానంతో మిగులు నిధుల్లో మాత్రమే ఆటగాళ్లకు అందజేస్తామని సీఏ అంటోంది. దాంతో సీఏకు ఆటగాళ్ల మధ్య వివాదం రాజుకుంది. జూన్ 30వ తేదీతో ఆటగాళ్ల పాత కాంట్రాక్ట్లు ముగుస్తున్న తరుణంలో కొత్త కాంట్రాక్ట్ ఒప్పుకోవాలంటూ సీఏ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ కాని పక్షంలో ఆటగాళ్లు నిరుద్యోగులుగా మారక తప్పదనే హెచ్చరికలు జారీ చేసింది. అయితే దీన్ని డేవిడ్ వార్నర్ సహా సీనియర్ క్రికెటర్లంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము నిరుద్యోగులుగా మారిన ఫర్వాలేదని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రస్తక్తే లేదని వారు ఎదురుదాడికి దిగారు. ఇందులో ఎవరు పైచేయి సాధిస్తారనే దానిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.

మరిన్ని వార్తలు