మహిళా టీ20 ప్రపంచకప్‌: ఫైనల్లో ఆసీస్‌

23 Nov, 2018 08:00 IST|Sakshi

నార్త్‌ సాండ్‌ (అంటిగ్వా) : మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం అర్ధరాత్రి ఆతిథ్య వెస్టిండీస్‌తో జరిగిన తొలి సెమీస్‌లో ఆసీస్‌ 71 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. అలీసా హీలీ (46), లానింగ్‌ (31), రాచెల్‌ హెనెస్‌ (25 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన విండీస్‌ మహిళలు కనీస పోరాట పటిమను కూడా ప్రదర్శించలేక 71 పరుగులకే చాప చుట్టేశారు. దీంతో ఆసీస్‌ ఘనవిజయంతో ఫైనల్లో అడుగెట్టింది. భారత కాలమాన ప్రకారం ఆదివారం జరిగే ఫైనల్లో ఆసీస్‌.. ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది.

మరిన్ని వార్తలు