ఆస్ట్రేలియానే ఫేవరెట్..కానీ

3 Jun, 2016 18:40 IST|Sakshi

ఆంటిగ్వా: కరీబియన్ దీవుల్లో జరిగే ముక్కోణపు సిరీస్ను తాము గెలిచే అవకాశం తక్కువేనని  వెస్టిండీస్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ స్పష్టం చేశాడు. అయినప్పటికీ తమను తక్కువగా అంచనా వేయవద్దని ప్రత్యర్థి జట్లను హెచ్చరించాడు. ఈ సిరీస్లో వరల్డ్ నంబర్ వన్ జట్టు ఆస్ట్రేలియానే ఫేవరెట్ అని పేర్కొన్నాడు.
 

'మా దేశంలో జరిగే ముక్కోణపు సిరీస్లో ఆస్ట్రేలియా కచ్చితంగా ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. అయితే మేము కూడా అంచనాలు మించి రాణిస్తాం. భారత్లో జరిగిన వరల్డ్ టీ 20 లో ఏమి జరిగిందో అంతా చూశారు. మాపై ఎటువంటి అంచనాలూ లేకపోయినా వరల్డ్ టీ 20 గెలిచాం'అని  సిమ్మన్స్ తెలిపాడు. ఈ సిరీస్లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో పాల్గొంటున్నాయి. ముక్కోణపు సిరీస్లో భాగంగా వెస్టిండీస్ తన తొలిపోరులో శుక్రవారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
 

మరిన్ని వార్తలు