ఆసీస్‌ ‘అత్యధిక పరుగుల’ రికార్డు

10 Dec, 2018 12:17 IST|Sakshi

అడిలైడ్‌: టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాను పరాజయం వెక్కిరించినప్పటికీ ఆ జట్టు ఒక రికార్డును మాత్రం సాధించింది. ఒక ఇన్నింగ్స్‌లో యాభైకి పైగా పరుగుల భాగస్వామ్యం లేకుండా అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. ఆసీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ ఒక జోడి కూడా యాభై పరుగుల భాగస్వామ్యం లేకపోవడం గమనార్హం. ఫలితంగా 2004లో వెస్టిండీస్‌పై బంగ్లాదేశ్‌ సాధించిన రికార్డు తెరమరుగైంది. అప్పుడు బంగ్లాదేశ్‌ ఒక ఇన్నింగ్స్‌లో 284 చేయగా, అందులో కూడా యాభైకి పైగా పరుగుల భాగస్వామ్యం రాలేదు.

మరొకవైపు ఈ టెస్టు మ్యాచ్‌లో 34 మంది క్యాచ్‌ల రూపంలో ఔటయ్యారు. దాంతో అత్యధికంగా క్యాచ్‌ల రూపంలో ఔటైన టెస్టు మ్యాచ్‌ల జాబితాలో భారత్‌-ఆసీస్‌ తాజా మ్యాచ్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఈ ఏడాది దక్షిణాఫ్రికా-ఆసీస్‌ జట్ల మధ్య కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌ తొలిస్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో 35 మంది క్యాచ్‌ల రూపంలో ఔటయ్యారు.

మరిన్ని వార్తలు