ఆసీస్‌కు ఇది మూడోది..

8 Mar, 2019 16:02 IST|Sakshi

రాంచీ:  ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మరో ఘనతను నమోదు చేసింది. భారత్‌లో మరో అత్యుత్తమ ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని సాధించింది. భారత్‌తో మూడో వన్డేలో ఆసీస్‌ తొలి వికెట్‌కు 193 పరుగులు చేసింది. ఇది భారత్‌లో భారత్‌పై ఆసీస్‌కు మూడో అత్యుత్తమంగా రికార్డులకెక్కింది.  ఓపెనర్లు అరోన్‌ ఫించ్‌-ఖాజాలు ధాటిగా బ్యాటింగ్‌ చేసి భారీ భాగస్వామ్యాన్ని సాధించిపెట్టారు. అయితే ఫించ్‌ 99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేసిన తర్వాత పెవిలియన్‌ చేరడంతో వారి తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. కుల్దీప్‌ ఎల్బీ చేయడంతో ఫించ్‌ సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు.

అంతకుముందు 1986లో తొలిసారి జెఫ్‌ మార్ష్‌- డేవిడ్‌ బూన్‌ల జోడి 212 పరుగుల ఓపెనింగ్‌ భాగస‍్వామ్యాన్ని సాధించగా, 2017లో అరోన్‌ ఫించ్‌-డేవిడ్‌ వార్నర్‌ల జోడి 231 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. తాజాగా  ఫించ్‌-ఖాజాల జోడి నమోదు చేసిన భాగస్వామ్య భారత్‌లో ఆసీస్‌ రఫున మూడోదిగా నిలిచింది. కాగా, భారత్‌పై భారత్‌లో అత్యుత్తమ ఓపెనింగ్‌ భాగస్వామ్యం రికార్డు దక్షిణాఫ్రికా పేరిటి ఉంది. 2000లో గ్యారీ కిరెస్టన్‌-గిబ్స్‌ల జోడి 235 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.

మరిన్ని వార్తలు