ఆస్ట్రేలియాదే చివరి వన్డే

5 Sep, 2016 01:00 IST|Sakshi

సెంచరీతో గెలిపించిన వార్నర్
శ్రీలంకపై 4-1తో సిరీస్ విజయం 


పల్లెకెలె: శ్రీలంక చేతిలో టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో పరువు నిలబెట్టుకుంది. ఐదు వన్డేల ఈ సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో లంకపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 40.2 ఓవర్లలో 195 పరుగులకే ఆలౌటైంది. గుణతిలక (39), ధనంజయ (34), కుషాల్ మెండిస్ (33), పతిరణ (32) ఓ మోస్తరుగా ఆడారు. మిషెల్ స్టార్క్ 40 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, హెడ్, జంపా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసింది.

కెప్టెన్ డేవిడ్ వార్నర్ (126 బంతుల్లో 106; 9 ఫోర్లు) సెంచరీతో చెలరేగాడు. శ్రీలంక గడ్డపై వన్డేల్లో ఒక ఆసీస్ ఆటగాడు సెంచరీ సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. వార్నర్, బెరుులీ కలిసి మూడో వికెట్‌కు 132 పరుగులు జోడించి ఆసీస్ విజయాన్ని సునాయాసం చేశారు. ఈ సిరీస్‌లో రెండో వన్డేలో మాత్రమే లంక నెగ్గింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 6, 9 తేదీల్లో రెండు టి20 మ్యాచ్‌లు జరుగుతారుు. 

 

>
మరిన్ని వార్తలు