అడిలైడ్ టెస్ట్: 444 పరుగులకు భారత్ ఆలౌట్

12 Dec, 2014 06:55 IST|Sakshi

అడిలైడ్: భారత్, ఆసీస్ జట్టుల మధ్య తొలి టెస్టులో భాగంగా నాలుగో రోజున భారత్ తొలి ఇన్నింగ్స్ 444 పరుగుల వద్ద ఆలౌటైంది.  తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 73 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ ఆటగాళ్లు మురళీ విజయ్ (53), పుజారా (73), రహానే (62), కోహ్లీ (115), రోహిత్ శర్మ (43) పరుగులు చేశారు. ఇషాంత్ పరుగులేమి తీయకుండానే వెనుతిరిగాడు. కరన్ శర్మ (4) సింగల్ డిజిట్కే పరిమితమైయ్యాడు. నాలుగో రోజు బరిలోకి దిగిన భారత్ ఆటగాళ్లు పేలవమైన ఆటను ప్రదర్శించి ఒకరితరువాత ఒకరు పెవిలియన్ బాటపట్టారు. కాగా, ఆసీస్ బౌలర్లు లియోన్ 5 వికెట్లు, సిడిల్ 2 వికెట్లు తీశాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు