251/6 పరుగుల వద్ద ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ డిక్లేర్

10 Jan, 2015 05:48 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య శనివారమిక్కడ ఆరంభమైన చివరి టెస్టులో ఐదవ రోజు ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ ను 251/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. నాలుగో టెస్ట్ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు ఆసీస్ 349 పరుగుల ఆధిక్యాన్ని చేజిక్కించుకుంది.   

అంతకుముందు ఆఖరి సెషన్‌లో భారత బౌలర్ల వైఫల్యాన్ని అందిపుచ్చుకున్న ఆసీస్ బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేశారు. కెప్టెన్ స్మిత్ (70 బంతుల్లో 71; 8 ఫోర్లు, 1 సిక్స్), జో బర్న్స్ (39 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసింది.

అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 162 ఓవర్లలో 475 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 97 పరుగుల ఆధిక్యం దక్కింది. కోహ్లి (230 బంతుల్లో 147; 20 ఫోర్లు)కి తోడు అశ్విన్ (111 బంతుల్లో 50; 6 ఫోర్లు), భువనేశ్వర్ (75 బంతుల్లో 30; 5 ఫోర్లు) ఆకట్టుకున్నారు. స్టార్క్‌కు 3 వికెట్లు దక్కాయి.

మరిన్ని వార్తలు