ఇంగ్లండ్ విజయలక్ష్యం 332

5 Aug, 2013 18:40 IST|Sakshi
ఇంగ్లండ్ విజయలక్ష్యం 332

మాంచెస్టర్:  ఇంగ్లండ్‌తో జరుగుతున్న  యాషెస్ మూడో టెస్టులో ఆస్ట్రేలియా 332 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగుల భారీ ఆధిక్యం... వికెట్లు కోల్పోయినా, వేగంగా పరుగులు సాధించి అసాధ్యమైన లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచాలని ఆస్ట్రేలియా భావించింది. అందుకు అనుగుణంగానే రెండో ఇన్నింగ్స్‌లో 36 ఓవర్లలోనే 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ఆసీస్ ఆధిక్యం 331 పరుగులకు చేరింది.
 
దీంతో భారీ పరుగుల ఆధిక్యంతో చివరిరోజు బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ పోరాడుతోంది. అనుకున్నట్లే ఆసీస్ సోమవారం తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ ఆదిలోనే తడబడింది. ప్రస్తుతం రెండు వికెట్లు కోల్పోయి 19 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.
 

మరిన్ని వార్తలు