ఐపీఎల్‌ కోసం ఆశగా..

9 Apr, 2020 10:42 IST|Sakshi

మెల్‌బోర్న్‌: కరోనా వైరస్‌ కారణంగా ఈసారి 2020 ఐపీఎల్‌ నిర్వహించడం దాదాపు అసాధ్యంగా మారింది.అంతా చక్కబడితే సెప్టెంబరు–అక్టోబరు సమయంలో లీగ్‌ జరగవచ్చని వినిపిస్తున్నా.. అది అంత సులువు కాదు. కాగా, ఆసీస్‌ క్రికెటర్లు మాత్రం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్‌ కోసం ఎదురు చూస్తున్నానని ఇదివరకే ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ పేర్కొనగా, ఇప్పుడు ఆ జాబితాలో ఆస్ట్రేలియాకే చెందిన స్టీవ్‌ స్మిత్‌ కూడా చేరిపోయాడు. కచ్చితంగా ఐపీఎల్‌ జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. (అత్యధిక ధర ఆటగాడి ఎదురుచూపులు..!)

ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో ఏదొక సమయంలో ఐపీఎల్‌ నిర్వహిస్తారని ధీమా  వ్యక్తం చేశాడు. ‘ ప్రస్తుతం ప్రపంచం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది. కరోనా వైరస్‌ కారణంగా మొత్తం లాక్‌డౌన్‌ అయ్యింది. దాంతోనే ఐపీఎల్‌ కూడా వాయిదా పడింది. కానీ ఐపీఎల్‌ ఏదొక సమయంలో జరుగుతుంది. నేను గత రెండు సీజన్లలో రాజస్తాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించా. కానీ పూర్తి స్థాయిలో సారథ్య బాధ్యతలు చేసే అవకాశం రాలేదు’ అని స్మిత్‌ తెలిపాడు.ఇక ఆస్ట్రేలియా క్రికెటర్‌గా ప్రపంచకప్‌, యాషెస్‌ తనకు పెద్ద విజయాలనీ, కానీ టెస్టుల్లో నంబర్‌ వన్‌గా కొనసాగుతున్న టీమిండియాను వారి గడ్డపై ఓడించాలనేది తన లక్ష్యమన్నాడు. అయితే భారత్‌ను వారి దేశంలో ఓడించడం అంత సులువు కాదనే విషయం తనకు తెలుసన్నాడు.(జడేజాను ఎదుర్కొవడం కష్టం: స్మిత్‌)

ఇక్కడ చదవండి: రవిశాస్త్రి ‘ట్రేసర్‌ బుల్లెట్‌’ వైరల్‌..!

మరిన్ని వార్తలు