'ఇదొక దురదృష్టకర ఘటన'

2 Oct, 2015 18:20 IST|Sakshi

ఢాకా: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనను వాయిదా వేసుకోవడం పట్ల ఆ దేశ క్రికెట్ బోర్డు డైలామాలో పడింది. భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లా పర్యటనను ఆసీస్ వాయిదా వేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్లపై మిలిటెంట్లు దాడి చేసే అవకాశాలున్నాయని విదేశీ మంత్రిత్వ శాఖ హెచ్చరికలతో బంగ్లా పర్యటన వాయిదా పడింది. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)లో తీవ్ర నిరాశకు లోనైంది. ఇలా పర్యటన వాయిదా పడటం బంగ్లా క్రికెట్ చరిత్రలోనే దురదృష్టకర ఘటనగా నిలిచిపోతుందని బోర్డు చీఫ్ నజ్ముల్ హసన్ ఆందోళన వ్యక్తం చేశాడు.

 

'ఆసీస్ జట్టు బంగ్లా పర్యటను వాయిదా వేసుకోవడంతో చాలా నిరాశ చెందాం. ఆసీస్ క్రికెట్ జట్టు ఆకస్మిక వాయిదా మమ్మల్ని షాక్ గురి చేసింది. బంగ్లాదేశ్ లో మిలిటెంట్ దాడి జరుగుతుందనడంలో ఎటువంటి వాస్తవం లేదు. బంగ్లా చరిత్రలోనే ఉగ్రవాదుల దాడి అనేది లేదు. చాలా దేశాలకు టెర్రరిస్టుల ముప్పు ఉన్నా.. పర్యటనలు రద్దు అయిన దాఖలాలు ఎప్పుడూ జరగలేదు'  అని నజ్ముల్ తెలిపాడు.

మరిన్ని వార్తలు