భారత్ పై ఆసీస్ విజయం

19 Oct, 2013 21:58 IST|Sakshi
భారత్ పై ఆసీస్ విజయం

మొహాలీ:ఏడు వన్డేల్లో భాగంగా భారత్ తో ఇక్కడ జరిగిన మూడో వన్డేలో ఆసీస్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 304 పరుగుల విజయలక్ష్యాన్ని ఆసీస్ ముందుంచింది. భారీ పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ర్టేలియా ఆరంభంలో కొద్దిగి వెనుకబడ్డప్పటికీ చివర్లో వీరోచితంగా ఆడి భారత్ ను కంగుతినిపింది. ఆసీస్ ఆటగాళ్లలో హ్యూజ్(38), ఫించ్ (22), వాట్సన్ (43) పరుగులు చేసి మ్యాచ్ పై ఆశలు కల్పించారు. అనంతరం ఆసీస్ ఆటగాళ్లను భారత్ కట్టడి చేయడంతో విజయం సాధించే దిశగా సాగింది.

 

కాగా, చివర్లో జేపీ ఫాల్క్‌నర్ (64),  వోగ్స్ (76) బ్యాట్ ను ఝుళిపించడంతో ఆసీస్ మరో విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. భారత బౌలర్లలో వినయ్ కుమార్ కు రెండు వికెట్లు లభించగా, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మలకు తలో వికెట్టు లభించింది. ఈ మ్యాచ్ లో విజయంతో ఆసీస్ 2-1 ఆధిక్యం సంపాదించింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసి న భారత్ 303 పరుగుల భారీ స్కోరు సాధించింది. మహేంద్ర సింగ్ ధోనీ (121 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 139 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్కు తోడు యువ సంచలనం విరాట్ కోహ్లీ (68) మరోసారి రాణించారు.

 

 

మరిన్ని వార్తలు