ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ పరిస్థితి విషమం!

26 Nov, 2014 09:47 IST|Sakshi
ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ పరిస్థితి విషమం!

సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ (25) పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.  సిడ్నీలో స్థానిక జట్లతో క్రికెట్ ఆడుతున్న సందర్భంగా అతని తలకు బంతి తాకింది. సియాన్ అబోట్ వేసిన  బౌన్సర్ను ఎదుర్కొంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ ఫిలిప్ హ్యూస్ తలకు తీవ్రంగా గాయమైంది. బంతి తలకు తాకగానే అతడు కుప్పకూలిపోయాడు.  


దాంతో హ్యూస్ ను హుటాహుటీన చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో సెయింట్ విన్సెంట్ ఆస్పత్రికి  తరలించారు. వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేశారు. కాగా హ్యూస్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఆసీస్ కెప్టెన్ క్లార్క్.... హ్యూస్ ఆరోగ్యంపై వాకబు చేశాడు. ఈ సంఘటన జరిగినప్పుడు హ్యూస్ తల్లి, సోదరి క్రికెట్ గ్రౌండ్లోనే ఉన్నారు.

కాగా ఫిల్ హ్యూస్ ఇప్పటివరకూ 25 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. టెస్ట్ క్రికెట్లో పదో వికెట్కు 163 పరుగుల భాగస్వామ్యం అందించి రికార్డు సృష్టించాడు.  గతనెల పాకిస్తాన్తో జరిగిన వన్డేల్లో అతను పాల్గొన్నాడు. అలాగే టీమిండియాతో జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్కు  హ్యూస్ పేరు పరిశీలనలోకి వచ్చింది.

మరిన్ని వార్తలు