సింధు శుభారంభం

5 Jun, 2019 23:27 IST|Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీ

సిడ్నీ: ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ సాధించే దిశగా భారత స్టార్‌ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో వరల్డ్‌ నెం.5, రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సింధు 21–14,21–9తో చొయరున్నీసా (ఇండోనేషియా)పై అలవోక విజయం సాధించింది. కాగా, పురుషుల విభాగంలో సమీర్‌ వర్మ, సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్‌ సైతం రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఆరో సీడ్‌ సమీర్‌ 21–15, 16–21, 21–12తో లీ జీ జియా(మలేషియా)పై గెలిచాడు. ఫలితంగా సుదిర్మన్‌ కప్‌లో అతని చేతిలో ఎదురైన అనూహ్య ఓటమికి బదులు తీర్చుకున్నాడు.

ఇతర మ్యాచ్‌ల్లో భమిడిపాటి సాయి ప్రణీత్‌ 21–16, 21–14తో లీ డాంగ్‌ కియూన్‌ (దక్షిణకొరియా)పై, కశ్యప్‌ 21–16, 21–15తో అవిహింగ్‌సనన్‌(థాయ్‌లాండ్‌) పై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరుకోగా, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 18–21, 19–21తో చైనా దిగ్గజం లిన్‌ డాన్‌ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తదుపరి రౌండ్‌లో జిందాపోల్‌(థాయ్‌లాండ్‌)తో సింధు, వాంగ్‌ జు వీ(తైవాన్‌)తో సమీర్, ఆంథోనీ సినిసుక గింటింగ్‌(ఇండోనేషియా)తో ప్రణీ త్‌ తలపడతారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి–చిరాగ్‌ షెట్టి ద్వయం 21–12, 21–16తో మనదేశానికే చెందిన  మనుఅత్రి –సుమీత్‌ రెడ్డిజోడీని ఓడించగా,  మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప– సిక్కిరెడ్డి జోడీ 14–21, 13–21 తో బేక్‌ హ న– కిమ్‌ హైరిన్‌(దక్షిణకొరియా)జంట చేతిలో పరాజయం పాలైంది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శ్రీవల్లి రష్మిక, సాత్విక ముందంజ

చాంపియన్‌ కార్తీక్‌ సాయి

సింధు, శ్రీకాంత్‌లపైనే ఆశలు

ధోని సంగతి తెలీదు కానీ...

అంతా పీడకలలా అనిపిస్తోంది

వీధి రౌడీలా కాదు హీరోలా...

అదృష్టం మా వైపు ఉంది!

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

బౌండరీలు కూడా సమానమైతే?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

ఆ విషయంలో ఇండియాదే పైచేయి.. కానీ!

టామ్‌ లాథమ్‌ నయా రికార్డు

హిమాన్షు, నమితలకు టైటిల్స్‌

ప్రణవ్‌ రామ్‌కు సింగిల్స్‌ టైటిల్‌

హీరో.. విలన్‌.. గప్టిలే!

ఇదొక చెత్త రూల్‌: గంభీర్‌

జీవితాంతం కేన్‌కు క్షమాపణలు చెప్తాను : స్టోక్స్‌

‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’

నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్‌లో కీలక మలుపు

ఇంగ్లాండ్‌ అలా గెలిచిందట.!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం