ఆస్ట్రేలియన్ ఓపెన్‌ రెండో రౌండ్లో అజరెంకా

14 Jan, 2014 12:22 IST|Sakshi
ఆస్ట్రేలియన్ ఓపెన్‌ రెండో రౌండ్లో అజరెంకా

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డిపెడింగ్ చాంపియన్ విక్టోరియా అజరెంకా రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్లో జరిగిన పోరులో స్వీడన్కు చెందిన ప్రపంచ 91 ర్యాంక్ క్రీడాకారిణి జోహన్నా లార్సన్ను 7-6, 6-2తో అజరెంకా ఓడించింది. మొదటి రౌండ్లో 5-6తో వెనుకబడిన అజరెంకా ఆ తర్వాత పుంజుకుని ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. గంటా 46 నిమిషాల పాటు మ్యాచ్ జరిగింది.

గతేడాది విజేత ‘బెలారస్ భామ’ అజరెంకా ఈసారీ టైటిల్ నెగ్గి ‘హ్యాట్రిక్’ నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. అజరెంకా గెలిస్తే 1996లో మార్టినా హింగిస్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ‘హ్యాట్రిక్’ సాధించిన మరో క్రీడాకారిణిగా నిలుస్తుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు