ఓవరాల్‌ చాంపియన్‌ ఏవీ కాలేజి

17 Sep, 2018 10:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్‌ కాలేజి బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో దోమలగూడ ఏవీ కాలేజి జట్టు ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో అన్వర్‌ ఉల్‌ ఉలూమ్, మల్లేపల్లి జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకోగా... సిద్ధార్థ డిగ్రీ కాలేజి జట్టు మూడోస్థానాన్ని దక్కించుకుంది. ఆదివారం జరిగిన సూపర్‌ హెవీ (91 ప్లస్‌) వెయిట్‌ కేటగిరీలో అన్వర్‌ ఉల్‌ ఉలూమ్‌కు చెందిన మొహమ్మద్‌ మోసిన్‌ విజేతగా నిలిచాడు. ఎంవీఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజి విద్యార్థి వి. మాన్విత్‌ రెడ్డి రెండోస్థానాన్ని దక్కించుకోగా, ఎస్‌వీజీ డిగ్రీ కాలేజికి చెందిన బి. సాయికుమార్‌ మూడోస్థానంలో నిలిచాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వ్యాయామవిద్య కాలేజి ప్రిన్సిపాల్‌ రాజేశ్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.   

ఇతర వెయిట్‌ కేటగిరీల విజేతల వివరాలు

లైట్‌ ఫ్లయ్‌ (46–49 కేజీలు): 1. మొహమ్మద్‌ రయీస్, 2. పి. రాజు, 3. మొహమ్మద్‌ రోషన్, 3. ఎం. శ్రీనివాస్‌ నాయక్‌.  
ఫ్లయ్‌ వెయిట్‌ (49–52 కేజీలు): 1. డి. అనిల్, 2. పి. ఉపేందర్, 3. టి. జీవన్, 3. హస్జీత్‌.
బాంటమ్‌ (52–56 కేజీలు): 1. కె. రాజు, 2. పి. మహేందర్, 3. హబీబ్‌ ఉల్‌ రహమాన్, 3. అల్తాబ్‌ అహ్మద్‌.
లైట్‌ వెయిట్‌ (56–60 కేజీలు): 1. మొహమ్మద్‌ ముదస్సర్‌ అహ్మద్, 2. పి. సురేశ్, 3. ఎం. రోహిత్, 3. జి. నీరజ్‌ కుమార్‌.
లైట్‌ వెల్టర్‌ (60–64 కేజీలు): 1. ఆర్‌. పృథ్వీరాజ్, 2. బి. శ్రావణ్, 3. ఉదయ్‌ కిశోర్‌ యాదవ్, 3. ఖాగి మొహమ్మద్‌ సహబుద్దీన్‌.
వెల్టర్‌ (64–69 కేజీలు): 1. జి. కైలాశ్‌ రావు, 2. కె. అక్షయ్, 3. టి. అజయ్, 3. ఎన్‌. అభిషిత్‌.
మిడిల్‌ వెయిట్‌ (69–75 కేజీలు): 1. జి. అనిరుధ్, 2. ఎం. దేవానందం, 3. శ్రీకాంత్, 3. మొహమ్మద్‌ జకీయుద్దీన్‌.
లైట్‌ హెవీ (75–81 కేజీలు): 1. ఎం. సాయి కల్యాణ్‌ గౌడ్, 2. టి. విశాల్‌ చంద్ర, 3. ఆర్‌. వరుణ్‌ రెడ్డి, 3. ఎ. దీపక్‌ సాయి.
హెవీ వెయిట్‌ (81–91 కేజీలు): 1. డి. ఆకాశ్‌ రెడ్డి, 2. ముజహీత్‌ ఖాన్, 3. కె. సన్నీ, 3. మొహమ్మద్‌ అవాజ్‌ ఖాన్‌.

>
మరిన్ని వార్తలు