వైభవంగా అవార్డుల ప్రదానం

22 Nov, 2014 00:29 IST|Sakshi
వైభవంగా అవార్డుల ప్రదానం

ముంబై: బీసీసీఐ అవార్డుల కార్యక్రమం శుక్రవారం రాత్రి కన్నులపండుగగా జరిగింది. అవార్డులు అందుకున్న వారిలో ప్రస్తుత క్రికెటర్లతో పాటు మాజీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ అందుకున్నారు. బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు శివ్‌లాల్ యాదవ్ ఈ అవార్డును అందించారు. 58 ఏళ్ల వెంగ్‌సర్కార్ 116 టెస్టులు, 129 వన్డేలు ఆడారు. ఈ అవార్డుతో దిగ్గజాల సరసన తనను చేర్చినందుకు బీసీసీఐకి వెంగీ కృతజ్ఞతలు తెలిపారు.

 అలాగే మీడియం పేసర్ భువనేశ్వర్‌కు పాలీ ఉమ్రిగర్ అవార్డు (రూ.5 లక్షల నగదు బహుమతి), వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించిన బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మకు ప్రత్యేక అవార్డును ఇచ్చారు. రంజీల్లో ఉత్తమ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు ఇచ్చే లాలా అమర్‌నాథ్ అవార్డు (రూ.2.5 లక్షలు) పర్వేజ్ రసూల్, రంజీల్లో అత్యధిక పరుగులు సాధించినందుకు మాధవ్‌రావ్ సింధియా అవార్డు (రూ.2.5 లక్షలు) కేదార్ జాదవ్ (1223 పరుగులు)కు అందించారు. హైదరాబాద్‌కు చెందిన అండర్-19 క్రికెటర్ బి.అనిరుధ్‌కు ఎంఏ చిదంబరం ట్రోఫీ (రూ. 50 వేలు) అందించారు.

 

 

మరిన్ని వార్తలు