మరో ఇద్దరు భారత క్రికెటర్లు ఔట్‌..

20 Sep, 2018 15:26 IST|Sakshi
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో గాయపడ్డ హార్దిక్‌ను స్ట్రెచర్‌పై తరలిస్తున్న దృశ్యం

దుబాయ్‌: ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయపడి టోర్నీ నుంచి వైదొలగగా, ఇప్పుడు మరో ఇద్దరు భారత క్రికెటర్లు అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌లు సైతం గాయం కారణంగా ఆసియాకప్‌కు దూరమయ్యారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో అక్షర్‌ పటేల్‌ ఎడమచేతి చూపుడు వేలికి గాయమైంది. దాంతో అక్షర్‌ చేతి వేలికి స్కాన్‌ చేసిన తర్వాత గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలడంతో అతను పూర్తి సిరీస్‌ నుంచి వైదొలుగుతున్నట్లు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) స్పష్టం చేసింది.

ఈ విషయాన్ని తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న బీసీసీఐ.. తొడ కండరాల గాయంతో పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ కూడా ఆసియాకప్‌కు దూరమైనట్లు తెలిపింది. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో శార్దూల్‌ తొడ కండరాలు పట్టేశాయి. దాంతో  అక్షర్‌ పటేల్‌ స్థానంలో రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌ స్థానంలో సిద్దార్థ్‌ కౌల్‌లు తదుపరి సిరీస్‌లో ఆడతారని పేర్కొంది. హార్దిక్‌ పాండ్యా స్థానంలో దీపక్‌ చాహర్‌ను జట్టులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు