అజహర్ అలీ రికార్డు డబుల్ సెంచరీ

28 Dec, 2016 09:19 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ అజహర్ అలీ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. అజహర్ అలీ అద్భుత ఇన్నింగ్స్‌ (205 నాటౌట్: 364 బంతుల్లో 20 ఫోర్లు ) తో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ఒకే ఏడాది రెండు డబుల్ సెంచరీలు చేసిన తొలి పాక్ క్రికెటర్ గానూ రికార్డు నెలకొల్పాడు. మెల్‌బోర్న్ స్డేడియంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో ప్లేయర్ గా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 1984లో వెస్డిండీస్ దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ చేసిన 208 పరుగులే ఇక్కడ అత్యధికం. కాగా, పాక్ జట్టు నుంచి ఈ స్డేడియంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు అజహర్ దే. గతంలో పాక్ ఆటగాడు మాజిద్ ఖాన్ 158 పరుగులను ఈ ఇన్నింగ్స్ లో అజహర్ అలీ అధిగమించాడు.

139 ఓవర్ నైట్ స్కోరుతో ఉన్న అజహర్ అలీ వేగంగా ఆడి పరుగులు సాధించాడు. సోహైల్ ఖాన్‌(65 బంతుల్లో 65: 6 ఫోర్లు, 4 సిక్సర్లు)తో కలిసి ఎనిమిదో వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే సోహైల్ రనౌట్ కావడం, ఆ వెంటనే రియాజ్‌ను హాజెల్‌వుడ్ ను ఔట్ చేశాడు. దీంతో పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్‌ను 443/9 వద్ద డిక్లేర్ చేసింది. పాక్ ఇన్నింగ్స్‌లో అజహర్ అలీ డబుల్ సెంచరీ చేయగా, సోహైల్ ఖాన్, అసద్ షఫీఖ్ హాఫ్ సెంచరీ (50) చేశారు. బర్డ్‌, హాజెల్‌వుడ్‌కు చెరో మూడు వికెట్లు దక్కాయి. స్టార్క్, స్పిన్నర్ లియాన్‌ లకు ఒక వికెట్ పడగొట్టారు.

మరిన్ని వార్తలు