'రిటైర్మెంట్ పై ధోనియే చెప్పాలి'

11 May, 2016 20:30 IST|Sakshi
'రిటైర్మెంట్ పై ధోనియే చెప్పాలి'

ముంబై: తన రిటైర్మెంట్ పై మహేంద్ర సింగ్ ధోనియే చెప్పాలని మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ అన్నాడు. తన కెరీర్ లో ధోని ఎంతో సాధించాడని, భవిష్యత్ ఎంతో అతడే చెప్పాలని పేర్కొన్నాడు. 2019లో జరగబోయే 50 ఓవర్ల ఐసీసీ ప్రపంచ కప్‌లో టీమిండియాకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించడం అనుమానమేనని సౌరభ్ గంగూలీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందదే.

గంగూలీ అభిప్రాయాన్ని తాను గౌరవిస్తానని అజహర్ అన్నాడు. అయితే తన భవిష్యత్ పై నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ధోనికి వదిలి పెట్టాలని సూచించాడు. బెస్ట్ కెప్టెన్లలో ధోని ఒకడని కితాబిచ్చాడు. అన్ని ఫార్మాట్లలో టీమిండియాను నంబవన్ గా నిలిపాడని, మేజర్న టోర్నమెంట్లలో జట్టును గెలిపించాడని గుర్తు చేశాడు.

మరిన్ని వార్తలు