నువ్వు కోహ్లి కంటే గొప్ప క్రికెటర్‌ కావాలంటే..

13 Apr, 2020 10:45 IST|Sakshi

కరాచీ:  టీమిండియా కెప్టెన్‌, పరుగుల మెషీన్‌ విరాట్‌ కోహ్లి తరహాలో లెజెండ్‌ బ్యాట్స్‌మన్‌ అనిపించుకోవాలని ఉందంటూ గతంలో పాకిస్తాన్‌ క్రికెటర్‌ బాబర్‌ అజామ్‌ తన మనసులో మాటను వెల్లడించిన సంగతి తెలిసిందే. కోహ్లిలా కావాలని ఉందని, ఆ స్థాయికి చేరాలంటే ఇంకా గేమ్‌పై దృష్టి నిలపాల్సిన అవసరం ఉందన్నాడు. విరాట్‌కు స్థాయికి చేరువగా వెళ్లాలంటే మిక్కిలి శ్రమించాల్సిందేనని బాబర్‌ తెలిపాడు.

దీనిపై పాక్‌ దిగ్గజ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యత రమీజ్‌ రాజా మాట్లాడుతూ.. ‘ కోహ్లిని అధిగమించే అన్ని లక్షణాలు అజామ్‌లో ఉన్నాయి. కోహ్లి కంటే గొప్ప ఆటగాడిగా అయ్యే సామర్థ్యం అజామ్‌లో ఉంది. అయితే కోహ్లిని దాటాలంటే అజామ్‌  గేమ్‌ను మరింత మెరుగుపరుచుకోవాలి. పరుగులు చేస్తూ జట్టుకు విజయాలు అందించాలి. ఇక అజామ్‌ బ్యాటింగ్‌కు దిగిన ప్రతీ సందర్భంలోనూ తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అంతే కాకుండా సానుకూల ధోరణి అలవరుచుకోవాలి. అలసత్వాన్ని ఎప్పుడు దరిచేరనీయకూడదు. అటువంటప్పుడే ఒక గొప్ప క్రికెటర్‌గా రూపాంతరం చెందుతావు. (16 ఏళ్లయినా ఆ రికార్డును కొట్టలేకపోయారు)

సుదీర్ఘకాలం ఆటను శాసించాలంటే నువ్వు(అజామ్‌) చాలా ఓర్పుతో గేమ్‌పై ఇంకా ఫోకస్‌ చేయాలి. అజామ్‌ పూర్తి స్థాయి ప్రదర్శన బయటకు రావాలంటే ఆకర్షణీయంగా ఉండే వాతావారణం అవసరం. అప్పటివరకూ అజామ్‌లోని పూర్తిస్థాయి బ్యాటింగ్‌ బయటకు వస్తుందని నేను అనుకోవడం లేదు. తనను కోహ్లితో పోలికపై ఒకానొక సందర్భంలో అజామ్‌ మాట్లాడుతూ..  ఒక లెజెండ్‌ హోదాను సాధించాలని ఉందన్నాడు. కోహ్లి తరహాలో గ్రేట్‌ బ్యాట్స్‌మన్‌గా ఎదగాలని ఉందన్నాడు. కాగా, కోహ్లితో ఇప్పుడే పోలిక సరికాదన్నాడు. ఇప్పటికే దేశం కోసం కోహ్లి ఎంతో సాధించాడని, అతనితో అప్పుడే పోలిక వద్దన్నాడు. (కోహ్లిని తలపించే మొనగాడు వచ్చాడు..!)

మరిన్ని వార్తలు