వైరల్‌: ఈ క్యాచ్‌ ఎట్టా పట్టాడో తెలుసా?

12 Oct, 2018 08:24 IST|Sakshi
బాబర్‌ అజమ్‌

స్టన్నింగ్‌ క్యాచ్‌కు నెటిజన్ల ఫిదా

దుబాయ్‌: పాకిస్తాన్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్ట్‌ అనూహ్యంగా డ్రాగా ముగిసింది. గెలుపుపై ధీమాతో బరిలో దిగిన పాక్‌కు డ్రాతో ఆసీస్‌ చెక్‌ పెట్టింది. అయితే ఈ మ్యాచ్‌ చివరి రోజు ఆటలో పాక్‌ ఆటగాడు బాబర్‌ అజమ్‌ అందుకున్న స్టన్నింగ్‌ క్యాచ్‌కు సోషల్‌ మీడియా ఫిదా అయింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ 128వ ఓవర్‌లో బ్యాట్స్‌మెన్‌ మిచెల్‌ స్టార్క్‌ బంతిని లెగ్‌సైడ్‌ ఆడగా.. అక్కడే షార్ట్‌ ఫార్వార్డ్‌ ఫీల్డర్‌గా ఉన్న బాబర్‌ అజమ్‌ అద్భుత డైవ్‌తో బంతిని ఒడిసి పట్టుకున్నాడు. ఈ స్టన్నింగ్‌ క్యాచ్‌తో స్టార్క్‌తో పాటు మైదానంలోని ఆటగాళ్లంతా సంభ్రమాశ్చర్యానికి  గురయ్యారు. నెటిజన్ల అయితే సోషల్‌ మీడియా వేదికగా సూపర్‌ మ్యాన్‌ బాబర్‌ అజమ్‌ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

462 పరుగుల లక్ష్య ఛేదనలో 136/3తో గురువారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌ విజయానికి మరో 326 పరుగులు చేయాలి. ‘డ్రా’ కావాలంటే రోజంతా ఆడాలి. ఈ నేపథ్యంలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఉస్మాన్‌ ఖాజా (302 బంతుల్లో 141; 11 ఫోర్లు) అద్భుత శతకం, ట్రావిస్‌ హెడ్‌ (175 బంతుల్లో 72; 5 ఫోర్లు); కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ (194 బంతుల్లో 61 నాటౌట్‌; 5 ఫోర్లు)లు పాక్‌ విజయాన్ని లాగేసుకున్నారు.

మరిన్ని వార్తలు