కష్టాల్లో టీమిండియా.. ఆగిపోయిన ఆట

16 Nov, 2017 18:46 IST|Sakshi

కోల్‌కతా: శ్రీలంకతో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా ఆరంభంలోనే తడబడింది. టాస్‌ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్‌ దిగిన కోహ్లి సేన 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వర్షం కారణంగా మ్యాచ్‌ల ఆలస్యం కావడంతో లంచ్‌ తర్వాత నుంచి ఆట సాగింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి డకౌటయ్యారు. రాహుల్‌ ఇన్నింగ్స్‌ తొలి బంతికే అవుటయి ‘గోల్డెన్‌ డక్‌’గా పెవిలియన్‌ చేరాడు. 11 బంతులు ఆడిన కోహ్లి పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. శిఖర్‌ ధావన్‌ 11 బంతుల్లో 8 పరుగులు చేసి అవుటయ్యాడు. వీరు ముగ్గురిని లక్మల్‌ అవుట్‌ చేయడం విశేషం.

వెలుతురు మందగించడంతో ఆటను అంపైర్లు నిలిపిచేశారు. ఆట ఆగిపోయే సమయానికి భారత్‌ 11.5 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 17 పరుగులు చేసింది. చతేశ్వర్‌ పుజారా(8), అజింక్య రహానే(0) క్రీజులో ఉన్నారు. 8.2 ఓవర్‌ జరుగుతుండగా వెలుతురు సరిగా లేకపోవడంతో ఒకసారి మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగడంతో తొలి రోజు ఆటను ముందుగానే ముగించారు.

మరిన్ని వార్తలు