బ్యాడ్మింటన్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ 

3 May, 2018 02:07 IST|Sakshi
తన్‌ చన్‌ సియాంగ్‌ ,జుల్ఫాద్లి జుల్కిఫ్లి

ఇద్దరు మలేసియా షట్లర్లపై నిషేధం 

కౌలాలంపూర్‌: మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో ఇద్దరు మలేసియా బ్యాడ్మింటన్‌ ఆటగాళ్లపై కెరీర్‌ ముగిసే విధంగా నిషేధం విధించారు. 31 ఏళ్ల తన్‌ చన్‌ సియాంగ్, మాజీ జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌ 25 ఏళ్ల జుల్ఫాద్లి జుల్కిఫ్లిలు 2013 నుంచి క్రమం తప్పకుండా ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు స్వతంత్ర దర్యాప్తు బృందం విచారణలో తేలింది. దీంతో సియాంగ్‌పై 15 ఏళ్లు, జుల్ఫాద్లిపై 20 ఏళ్లు నిషేధం విధించారు. దీంతో వాళ్ల కెరీర్‌కు పూర్తిగా తెరపడింది.

వాళ్లు ఈ నిషేధ కాలంలో ఆటతో పాటు పరిపాలన, కోచింగ్, అధికారి, అభివృద్ధి పాత్రలకు కూడా దూరంగా ఉండాల్సిందేనని అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) స్పష్టం చేసింది. బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఫిక్సింగ్‌ ఉదంతంలో శిక్ష పడటం ఇదే తొలిసారి. బీడబ్ల్యూఎఫ్‌ నైతిక విలువల కమిటీ సియాంగ్‌కు రూ. 10 లక్షలు (15 వేల డాలర్లు), జుల్ఫాద్లికి రూ. 16.70 లక్షలు  (25వేల డాలర్లు) జరిమానాగా విధించింది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు