సైనాకు అరుదైన గౌరవం

19 Oct, 2016 01:39 IST|Sakshi
సైనాకు అరుదైన గౌరవం

 హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అథ్లెట్స్ కమిషన్‌లో సభ్యురాలిగా సైనాను నియమించారు. ఈ మేరకు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ నుంచి సైనాకు సోమవారం రాత్రి అధికారిక నియామక పత్రం అందింది. గత ఆగస్టులో రియో ఒలింపిక్స్ సందర్భంగా అథ్లెట్స్ కమిషన్ ఎన్నికలు జరిగాయి.

అమెరికా ఐస్ హాకీ క్రీడాకారిణి ఎంజెలో రుజియెరో అధ్యక్షురాలిగా ఉన్న ఈ ఐఓసీ అథ్లెట్స్ కమిషన్‌లో తొమ్మిది మంది ఉపాధ్యక్షులు, 10 మంది సభ్యులు ఉన్నారు. అథ్లెట్స్ కమిషన్ సమావేశం వచ్చేనెల 6న జరుగుతుంది. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న సైనా ఇటీవలే మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించింది. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలో ఆమె మళ్లీ బరిలోకి దిగొచ్చు.

>
మరిన్ని వార్తలు