క్రికెటర్ బద్రీనాథ్ అరుదైన ఘనత

22 Nov, 2016 12:45 IST|Sakshi
క్రికెటర్ బద్రీనాథ్ అరుదైన ఘనత

వల్సాడ్ (గుజరాత్):హైదరాబాద్ క్రికెట్ కెప్టెన్ సుబ్రమణియన్ బద్రీనాథ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో పదివేల పరుగుల క్లబ్లో చేరాడు. చత్తీస్గఢ్తో మ్యాచ్ సందర్భంగా బద్రీనాథ్(134) శతకం బాది పదివేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఫస్ట్ క్లాస్ల్లో పదివేల పరుగులను పూర్తి చేసుకున్న 47వ భారతీయ క్రికెటర్గా బద్రీనాథ్ నిలిచాడు. ప్రస్తుతం ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 55.19 సగటుతో 10,045 పరుగులు బద్రీనాథ్ సాధించాడు.

2000-01 సీజన్లో తమిళనాడు రాష్ట్రం తరపున బద్రీనాథ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతని అత్యధిక స్కోరు 250. 2009లో ముంబైపై అత్యధిక స్కోరు బద్రీనాథ్ సాధించాడు. ఇదే తన కెరీర్లో అద్భుతమైన ఇన్నింగ్స్ అని బద్రీనాథ్ తాజాగా పేర్కొన్నాడు. దాంతో పాటు రంజీల్లో తమిళనాడు జట్టును మూడుసార్లు ఫైనల్కు చేర్చడంలో తన పాత్రను గుర్తు చేసుకున్నాడు.ఆ తరువాత తాను విదర్భ జట్టుకు ఆడానని, తాను ఆ జట్టు తరపున పాల్గొన్న తొలి సీజన్లోనే నాకౌట్ అర్హత సాధించామన్నాడు. ఇవన్నీ తన కెరీర్లో మరిచిపోలేనివని బద్రీనాథ్ స్పష్టం చేశాడు.

మరిన్ని వార్తలు