ఆసియా చాంప్‌ బహ్రెయిన్‌

1 Dec, 2017 10:56 IST|Sakshi

హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌  

హైదరాబాద్‌: ఆసియా క్లబ్‌ లీగ్‌ పురుషుల హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో బహ్రెయిన్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది. కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియం వేదికగా జరిగిన ఈ అంతర్జాతీయ టోర్నీలో బహ్రెయిన్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో బహ్రెయిన్‌  21–16తో ఖతర్‌ క్లబ్‌పై విజయం సాధించింది. మొత్తం 9 దేశాలకు చెందిన 10 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో ఖతర్‌కే చెందిన అల్‌ అహిల్‌ క్లబ్‌ మూడో స్థానాన్ని దక్కించుకుంది. యూఏఈకి చెందిన షార్జా జట్టు నాలుగో స్థానంలో నిలిచింది.

ఫైనల్‌ అనంతరం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జె. సంతోష్‌ కుమార్, ఆసియా హ్యాండ్‌బాల్‌ సమాఖ్య ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అహ్మద్‌ బాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి బహ్రెయిన్‌ జట్టుకు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్‌’ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి,  క్రీడా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, భారత హ్యాండ్‌ బాల్‌ సమాఖ్య అధ్యక్షులు రామ సుబ్రమణి, కార్యదర్శి ఆనందేశ్వర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు