క్రికెటర్ల కళ్లు తెరుచుకున్నాయి: కలిస్

2 Apr, 2018 10:39 IST|Sakshi

సాక్షి, కోల్‌కతా : క్రికెట్‌ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంపై దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్‌ జాకస్ కలిస్‌ స్పందించాడు. ‘ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేసిన ఈ పని క్రికెట్‌ ప్రపంచానికి ఒక వేకప్‌ కాల్‌ వంటిది. ప్రతీ ఆటగాడు తాము అనుసరించాల్సిన విధానాలపై స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని’ కలిస్‌ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న ఈ మాజీ ఆల్‌రౌండర్‌ కేకేఆర్‌ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

విలేకరుల సమావేశంలో ట్యాంపరింగ్‌ వివాదంపై మాట్లాడుతూ.. ‘స్మిత్‌, వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌ చేసిన పని, ఎదుర్కొన్న పరిస్థితులు ప్రతీ ఆటగాడి కళ్లు తెరుచుకున్నాయి. క్రీడాస్పూర్తితో సరైన పద్ధతిలో మాత్రమే ఆడాలి. ఐపీఎల్‌లో కేకేఆర్‌ టీమ్ ఆట తీరుతో సంతోషంగా ఉన్నాను. గతంలో మెరుగైన ప్రదర్శన చేశాం. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని’ కలిస్‌ తెలిపాడు. ఈ కార్యక్రమంలో కలిస్‌తో పాటు కేకేఆర్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌, రాబిన్‌ ఊతప్ప, పియూష్‌ చావ్లా, ఆండ్రూ రస్సెల్‌, శివమ్‌ మావి, శుభమ్‌ గిల్‌, కమలేశ్‌ నాగర్‌కోటి పాల్గొన్నారు. ఏప్రిల్‌ 8న ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో కేకేఆర్‌ జట్టు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో తమ మొదటి మ్యాచ్‌ ఆడనుంది.

మరిన్ని వార్తలు