100 పరుగుల స్కోరు దాటిన బంగ్లాదేశ్

13 Mar, 2015 08:16 IST|Sakshi

హామిల్టన్: ప్రపంచకప్ లో భాగంగా గ్రూపు-ఏలో న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 24.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు పూర్తి చేసింది. సౌమ్య సర్కార్ 42, మహ్మదుల్లా 43 పరుగులతో ఆడుతున్నారు. మూడో వికెట్ వీరిద్దరూ 37 బంతుల్లో 50 పరుగులు జోడించారు. ఇమ్రుల్ కేయస్(1), తమీమ్ ఇక్బాల్(13) అవుటయ్యారు. వీరిద్దరినీ ట్రెంట్ బౌల్ట్ అవుట్ చేశాడు. 64 బంతుల్లో 60 పరుగులు చేశారు.

మరిన్ని వార్తలు