జింబాబ్వేపై బంగ్లాదేశ్‌ విజయం

19 Sep, 2019 03:06 IST|Sakshi

సొంతగడ్డపై జరుగుతున్న ముక్కోణపు టి20 సిరీస్‌లో బంగ్లాదేశ్‌ ఎట్టకేలకు సాధికారిక ఆటను ప్రదర్శించింది. బుధవారం జింబాబ్వేతో చిట్టగాంగ్‌లో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఆ జట్టు 39 పరుగులతో గెలిచింది. మహ్మదుల్లా (41 బంతుల్లో 62; ఫోర్, 5 సిక్స్‌లు) దూకుడైన అర్ధ సెంచరీకి తోడు ముషి్ఫకర్‌ (32), లిటన్‌ దాస్‌ (38) రాణించడంతో... నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్‌ ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం షఫీయుల్‌ ఇస్లాం (3/36), ముస్తాఫిజుర్‌ (2/38), అమినుల్‌ ఇస్లాం (2/18) వరుసగా వికెట్లు పడగొట్టడంతో ఛేదనలో జింబాబ్వే 136 పరుగులకు ఆలౌటైంది. ముతుంబామి (32 బంతుల్లో 54; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), జార్విస్‌ (27) కాస్త నిలిచారు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా