బంగ్లాదేశ్‌ అద్భుత విజయం

14 Sep, 2019 02:31 IST|Sakshi

ఢాకా: జింబాబ్వేతో టి20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ విజయలక్ష్యం 18 ఓవర్లలో 145 పరుగులు... 60 పరుగులకే ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయింది. అయితే అఫీఫ్‌ హుస్సేన్‌ (26 బంతుల్లో 52; 8 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు బ్యాటింగ్‌కు తోడు మొసద్దిక్‌ హుస్సేన్‌ (24 బంతుల్లో 30 నాటౌట్‌; 2 సిక్సర్లు) అండగా నిలవడంతో ఆ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 17.4 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసి మ్యాచ్‌ గెలుచుకున్న బంగ్లా ముక్కోణపు టి20 టోరీ్నలో శుభారంభం చేసింది. అంతకు ముందు జింబాబ్వే నిరీ్ణత 18 ఓవర్లలో 5 వికెట్లకు 144 పరుగులు చేసింది. ర్యాన్‌ బర్ల్‌ (32 బంతుల్లో 57; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి అర్ధసెంచరీ సాధించగా, కెప్టెన్‌ మసకద్జా (26 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. బంగ్లా కెపె్టన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ వేసిన ఓవర్లో బర్ల్‌ వరుసగా 6, 4, 4, 6, 4, 6 బాది మొత్తం 30 పరుగులు సాధించడం విశేషం!   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు