వివాదస్పద క్రికెటర్ పై నిషేధం తొలగింపు

10 May, 2016 20:18 IST|Sakshi
వివాదస్పద క్రికెటర్ పై నిషేధం తొలగింపు

ఢాకా: క్రికెటర్ షాదత్ హుస్సేన్ పై విధించిన నిషేధాన్ని బంగ్లాదేశ్ ఎత్తివేసింది. స్వదేశంలో మ్యాచ్ లు ఆడేందుకు అతడిని అనుమతించింది. క్రిమినల్ కేసు ఎదుర్కొన్న హుస్సేన్ పై గతేడాది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) నిషేధం విధించింది. తన ఇంట్లో పనిచేసే 11 ఏళ్ల బాలికను అతడు వేధించినట్టు ఆరోపణలు రావడంతో దుమారం రేగింది. ఈ వివాదం మీడియాలో హైలెట్ కావడంతో హుస్సేన్ తో పాటు అతడి భార్య న్రిట్టో షాదత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అతడిపై బీసీబీ చర్య తీసుకుంది.

తాను తప్పు చేయలేదని బుకాయించిన హుస్సేన్ ఎట్టకేలకు క్షమాపణ చెప్పాడు. తాను తప్పు చేశానని, మన్నించాలని ఏప్రిల్ 28న బీసీబీని వేడుకున్నాడు. ఈ కేసులో నేరం రుజువయితే హుస్సేన్, అతడి భార్యకు 14 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అయితే హుస్సేన్ తో బాధిత బాలిక కుటుంబంతో రాజీకి వచ్చిందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. బాలిక కుటుంబానికి హుస్సేన్ డబ్బు ముట్టజెప్పి, తనపై ఆరోపణలను ఉపసంహరించుకునేలా ఒప్పించాడని తెలిపాయి.

మరిన్ని వార్తలు