ఆదిలోనే బంగ్లాకు షాక్‌

14 Nov, 2019 10:26 IST|Sakshi

ఇండోర్‌: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను షాద్‌మన్‌ ఇస్లామ్‌, ఇమ్రుల్‌ కేస్‌లు ప్రారంభించగా వారిద్దరూ తలో ఆరు పరుగులు చేసి పెవిలియన్‌ చేరారు. ఇషాంత్‌ వేసిన  ఆరో ఓవర్‌ చివరి బంతికి షాద్‌మన్‌ ఔట్‌ కాగా, ఆపై ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఏడో ఓవర్‌ ఆఖరి బంతికి ఇమ్రుల్‌ పెవిలియన్‌ బాట పట్టాడు.

షాదమ్‌న్‌ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా పట్టగా, ఇమ్రుల్‌ ఇచ్చిన క్యాచ్‌ను రహానే అందుకున్నాడు. దాంతో 12 పరుగులకే బంగ్లాదేశ్‌ రెండు వికెట్లను చేజార్చుకుంది. 12 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయిన బంగ్లాదేశ్‌.. అదే స్కోరు వద్ద మరో వికెట్‌ను చేజార్చుకుంది.ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. దాంతో భారత్‌కు ఫీల్డింగ్‌ తప్పలేదు. 2018 నుంచి భారత్‌ తొలిసారి ఫీల్డింగ్‌ చేసిన టెస్టు మ్యాచ్‌ల్లో అధిక శాతం ప్రతికూల ఫలితమే వచ్చింది. అప్పట్నుంచి ఇప్పటివరకూ చూస్తే భారత్‌ ఏడుసార్లు తొలుత ఫీల్డింగ్‌ చేసిన సందర్భాల్లో ఆరుసార్లు ఓటమి చవిచూసింది. ఒకే మ్యాచ్‌ గెలిచింది.

మరిన్ని వార్తలు