-

కోహ్లి అసలు మనిషే కాదు: బంగ్లా బ్యాట్స్‌మన్‌

23 Oct, 2018 16:58 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

ఢాకా: సెంచరీలతో చెలరేగుతున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అసలు మనిషే కాదని బంగ్లాదేశ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ అభిప్రాయపడ్డాడు. కోహ్లిలో ఏదో శక్తి దాగి ఉందని ఖలీజ్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో కోహ్లి కెరీర్లో 36వ సెంచరీ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ శతకానికి ఫిదా అయిన తమీమ్‌ కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించాడు. (చదవండి: సెంచరీల సరదాట)

‘కోహ్లి ఆటను చూస్తుంటే నాకు అతను మనిషేనా అనిపిస్తోంది. ప్రతి మ్యాచ్‌లో సెంచరీ చేసేలా కనిపిస్తున్నాడు. ఆటపట్ల అతనికున్న నిబద్దతను చూస్తుంటే నమ్మబుద్ది కావడం లేదు. మూడు ఫార్మట్లలో అతనే ప్రపంచ నెం1 బ్యాట్స్‌మన్‌. కోహ్లి కూడా ఎవరినో ఒకరిని చూస్తూ.. ఆరాదిస్తూ అతని నుంచి ఎదో ఒకటి నేర్చుకొని ఉంటాడు. గత 12 ఏళ్లుగా నేను ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను చూశాను. వారందరిలో ఎవరి ప్రత్యేక వారిదే. కానీ నాకు వారిలో కోహ్లిని డామినేట్‌ చేసే ఆటగాడు ఒక్కరు కూడా కనిపించలేదు. నిజంగా కోహ్లి ఓ అద్భుతం’ అని చెప్పుకొచ్చాడు. ఇటీవల జరిగిన ఆసియాకప్‌లో తమీమ్‌ తన అసాధారణ ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. (చదవండి: మరో రికార్డుకు చేరువలో కోహ్లి)

మరిన్ని వార్తలు