బంగ్లాదేశ్‌ నిలుస్తుందా?

13 Nov, 2019 05:11 IST|Sakshi

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన కోహ్లి బృందం మరో సిరీస్‌కు సిద్ధమైంది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం ఇండోర్‌లో మొదలయ్యే తొలి టెస్టు కోసం టీమిండియా సాధన మొదలుపెట్టింది. ఫామ్‌లో ఉన్న పేసర్లు షమీ, ఇషాంత్, ఉమేశ్‌ యాదవ్‌లను... అశ్విన్, రవీంద్ర జడేజాలాంటి మేటి స్పిన్నర్లను బంగ్లాదేశ్‌ ఏమేరకు ఎదుర్కొంటుందో వేచి చూడాలి.  2000లో టెస్టు హోదా పొంది భారత్‌తోనే ఢాకాలో తొలి టెస్టు ఆడిన బంగ్లాదేశ్‌ ఇప్పటివరకు భారత్‌పై మాత్రం గెలవలేకపోయింది. గత 19 ఏళ్లలో భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య 9 టెస్టులు జరిగాయి. 7 టెస్టుల్లో భారత్‌ నెగ్గగా... రెండు టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. భారత్‌తో భారత్‌లో టెస్టు ఆడేందుకు మాత్రం బంగ్లాదేశ్‌ 17 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. 2017 ఫిబ్రవరిలో హైదరాబాద్‌ వేదికగా టీమిండియాతో బంగ్లాదేశ్‌ టెస్టు ఆడింది. ఆ మ్యాచ్‌లో భారత్‌ 208 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. నిషేధం కారణంగా స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌... వ్యక్తిగత కారణాలతో తమీమ్‌... గాయం కారణంగా మష్రఫె ముర్తజాలాంటి మేటి ఆటగాళ్ల సేవలు బంగ్లాదేశ్‌ కోల్పోయిన నేపథ్యంలో టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ ఎలా నెట్టుకొస్తుందో చూడాలి. ఓవరాల్‌గా బంగ్లాదేశ్‌ గత 19 ఏళ్లలో మొత్తం 115 టెస్టులు ఆడింది. ఇందులో 13 మ్యాచ్‌ల్లో గెలిచిన ఆ జట్టు ఏకంగా 86 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. 16 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది.

>
మరిన్ని వార్తలు