కొచ్చి ఫ్రాంచైజీ దక్కించుకున్న సచిన్

13 Apr, 2014 15:13 IST|Sakshi
కొచ్చి ఫ్రాంచైజీ దక్కించుకున్న సచిన్

ముంబై: క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ... ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్(ఐఎస్ఎల్)లో ఫ్రాంచైజీలు దక్కించుకున్నారు. పీవీపీ వెంచర్స్తో కలిసి కొచ్చి జట్టును సచిన్ కొనుగోలు చేశాడు. స్పెయిన్ లీగ్ దిగ్గజం అట్లెటికొ మాడ్రిడ్, వ్యాపారవేత్తలు  హర్షవర్థన్ నియోటియా, సంజీవ్ గోయంకా కలిసి కన్సర్టియంగా ఏర్పడిన గంగూలీ.. కోల్కతా ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నాడు.

బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, రణ్బీర్ కపూర్ కూడా ఐఎస్ఎల్ ఫ్రాంచైజీలు దక్కించుకున్నారు. పుణే జట్టును సల్మాన్ ఖాన్, గువాహటి టీమ్ను జాన్ అబ్రహం, ముంబై ఫ్రాంచైజీని రణ్బీర్ కపూర్ వేలంలో దక్కించుకున్నారు. ఢిల్లీ జట్టును సమీర్ మాంచంద, బెంగళూరు టీమ్ను సన్ గ్రూపు, గోవా జట్టును వేణుగోపాల్ దూత్ కన్సర్టియం దక్కించుకున్నాయి. సెప్టెంబర్-నవంబర్లో ఐఎస్ఎల్ మ్యాచ్లు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు