ఇట్స్‌ మిరాకిల్‌.. ఒకే రోజు రెండు

8 Jan, 2020 17:27 IST|Sakshi

అడిలైడ్‌: బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌) ఒకే రోజు రెండు అద్భుతాలు చోటు చేసుకున్నాయి. ధనాధన్‌ ఫార్మట్‌లో బ్యాట్స్‌మెన్‌ హవా కొనసాగుతున్న తరుణంలో బౌలర్లు కూడా తమ సత్తా చాటుతున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఒకే రోజు రెండు హ్యాట్రిక్‌ వికెట్స్‌ నమోదయ్యాయి. తొలుత అడిలైడ్‌ స్ట్రైకర్‌ స్పిన్నర్‌, అఫ్గానిస్తాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ సిడ్నీ సిక్సర్స్‌పై హ్యాట్రిక్‌ నమోదు చేయగా.. ఇదే రోజు మెల్‌బోర్న్‌ స్టార్స్‌, పాకిస్తాన్‌ ప్లేయర్‌ హ్యారీస్‌ రౌఫ్‌ సిడ్నీ థండర్‌పై రెండో హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. సిడ్నీ థండర్‌తో మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ పేస్‌ బౌలర్‌ వరుసగా ఫెర్గుసన్‌ (35), గిల్స్క్‌(41), స్యామ్స్ ‌(0) వికెట్లన పడగొట్టి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. దీంతో ఒకే రోజు రెండు హ్యాట్రిక్‌ వికెట్లు నమోదవడంపై బీబీఎల్‌ ఫ్యాన్స్‌ సంబరపడుతూ ఇట్స్‌ మిరాకిల్‌ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా, సిడ్నీ సిక్సర్‌తో జరిగిన మ్యాచ్‌లో అడిలైడ్‌ స్ట్రైకర్‌ మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ హ్యాట్రిక్‌ నమోదు చేసిన విషయం తెలిసిందే. వరుసగా జేమ్స్‌ విన్సే(27), జోర్డాన్‌ సిల్క్‌(16), జాక్‌ ఎడ్వర్డ్స్‌(0)లను ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. అయితే రషీద్‌ హ్యాట్రిక్‌తో మెరిసినా అడిలైడ్‌ ఓటమి చవిచూసింది. రెండు వికెట్లు తేడాతో సిడ్నీ సిక్సర్‌ విజయం సాధించింది. ఇక గత కొంతకాలంగా విశేషంగా రాణిస్తున్న జూనియర్‌ రావల్సిండి ఎక్స్‌ప్రెస్‌ హ్యారీస్‌ రౌఫ్‌ టీ20 ప్రపంచకప్‌ కోసం సమయాత్తమవుతున్నాడు. దీనికోసం బీబీఎల్‌ను చక్కగా వినియోగించుకోవాలని ఈ పాక్‌ బౌలర్‌ భావిస్తున్నాడు. గతేడాది డిసెంబర్‌లో బీబీఎల్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో ఈ పాకిస్తాన్‌ క్రికెటర్‌ హ్యారీస్‌ రౌఫ్‌.. ఆ మ్యాచ్‌లో వాడిని బంతిని మ్యాచ్‌ అనంతరం అక్కడున్న ఓ భారతీయ సెక్యూరిటీ గార్డుకు బహుమతిగా ఇవ్వడం నెటిజన్లను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 

 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా