మాకు కోహ్లి కావాలి: బంగ్లాదేశ్‌

22 Feb, 2020 12:45 IST|Sakshi

ఢాకా:  బంగ్లాదేశ్‌ జాతిపిత షేక్‌ ముజిబూర్‌ రెహ్మాన్‌ శతజయంతి సందర్భంగా వచ్చే నెలలో ఆసియా ఎలెవన్, ప్రపంచ ఎలెవన్‌ జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లను నిర్వహించడానికి ఆ దేశ క్రికెట్‌ బోర్డు(బీసీబీ)  ఇప్పటికే సగం ఏర్పాట్లును పూర్తి చేసింది. ఇంకా షెడ్యూల్‌, ఆటగాళ్ల పూర్తి వివరాలను ఖరారు చేయాల్సి ఉండగా దానిపై తమ కార్యాచరణను ముమ్మరం చేసింది. మార్చి 18-22 మధ్యలో రెండు టీ20లను జరపాలని బంగ్లాదేశ్‌ యోచిస్తోంది. దీనిలో భాగంగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని కచ్చితంగా ఆసియా ఎలెవన్‌ జట్టులో ఉంచాలని బీసీబీ పట్టుదలతో ఉంది.  (ఇక్కడ చదవండి: పాక్‌ వద్దు.. భారత్‌ ముద్దు)

‘మేము ఇంకా షెడ్యూల్‌, అందుబాటులో ఉండే ఆటగాళ్లపై కసరత్తులు చేస్తున్నాం. మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మేము ప్రస్తుతం భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీ)తో టచ్‌లో ఉన్నాం. భారత్‌ నుంచి ఏ ఆటగాళ్లు ఉంటారు అనే దానిపై వివరణ కోరాం. కాకపోతే కోహ్లి కచ్చితంగా ఉండాలని బీసీసీఐకి విజ‍్క్షప్తి చేశాం. దీనిపై బీసీసీఐ సానుకూలంగా స్పందించింది. ఈ విషయాన్ని బీసీసీఐ పరిశీలిస్తోంది. కోహ్లితో మాట్లాడిన తర్వాత మాకు సందేశం పంపొచ్చు. ఈ  రెండు టీ20ల సిరీస్‌లో కోహ్లి ఉంటాడనే భావిస్తున్నాం’ బీసీబీ తెలిపింది.(ఇక్కడ చదవండి: ‘మేము రావట్లేదు.. మీరే ఆడుకోండి’)

అయితే భారత్‌ నుంచి నాలుగు నుంచి ఐదుగురు ప్లేయర్లను ఆసియా ఎలెవన్‌ తరఫున ఆడటానికి పంపించడానికి సిద్ధమవుతున్న విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. కాకపోతే ఆ క్రికెటర్ల పేర్లు ఇంకా ఖరారు కాలేదన్నాడు. ఆదివారం జరుగనున్న ఎపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో బంగ్లాదేశ్‌ అభ్యర్థనపై బీసీసీఐ చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. రేపు దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై కోహ్లితో ముందుగా చర్చించాలని బీసీసీఐ భావిస్తోంది. 

మరిన్ని వార్తలు