‘ఈ విజయం చాలా గొప్పది.. మనవాళ్లు అదరగొట్టారు..’

14 Feb, 2018 11:40 IST|Sakshi
బీసీసీఐ తాత్కలిక అధ్యక్షుడు సీకే ఖన్నా

టీమిండియా ఆరు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 4-1తో సొంతం చేసుకుంది. పోర్ట్‌ఎలిజబెత్‌లో మంగళవారం ఇండియా- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఐదో వన్డేలో భారత్‌ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంపై బీసీసీఐ తాత్కలిక అధ్యక్షుడు సీకే ఖన్నా మన క్రికెటర్లను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విజయం చాలా గొప్పది అని అన్నారు. 

‘ఇండియా సారథి విరాట్‌ కోహ్లి, మిగతా ఆటగాళ్లు అసాధారణమైన ప్రదర్శన కనబర్చారు. ఏ జట్టునైనా వారి స్వదేశలంలో ఓడించే సామర్ధ్యం ఇండియా జట్టుకు ఉందని ఈ విజయంతో నిరూపించారు. 25 సంవత్సరాల తర్వాత ‍ వారు భారత్‌కు సిరీస్‌ సాధించండం​ దేశానికి గర్వకారణం’ అని సీకే ఖన్నా ఇండియా క్రికెటర్లను కొనియాడారు.

దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. మొదట నుంచి విఫలం చెందిన రోహిత్‌ ఐదో వన్డేలో  సెంచరీతో మెరిశాడు. రోహిత్‌ను(126 బంతుల్లో; 115 పరుగులు) ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’  అవార్డు వరించింది. వన్డే కెరీర్‌లో రోహిత్‌కు 17వ సెంచరీ. సౌతాఫ్రికా బౌలర్లలో ఇన్‌గిడి 4 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం దక్షిణాఫ్రికా 42.2 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. హషీం ఆమ్లా(71పరుగులు) ఒక్కడే పోరాడాడు. జట్టును విజయం వైపు నడిపిస్తున్న ఆమ్లాను పాండ్యా అద్భుత ఫీల్డింగ్‌తో రన్‌ అవుట్‌ చేశాడు. ఇండియా బౌలర్లలో  కుల్దీప్‌ యాదవ్‌కు 4 వికెట్లు, హర్ధిక్‌ పాండ్యాకు 2 వికెట్లు, చాహల్‌కు 2 వికెట్లు, బుమ్రాకు ఒక వికెట్‌ దక్కాయి. ఈ విజయంతో సిరీస్‌ సొంతం చేసుకున్న భారత్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానాన్ని పటిష్టం చేసుకుంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఓవర్‌త్రోను చూసి ఎగిరి గంతులేశాడు!

ఆ సలహానే పని చేసింది: ఆర్చర్‌

శ్రీవల్లి రష్మిక, సాత్విక ముందంజ

చాంపియన్‌ కార్తీక్‌ సాయి

సింధు, శ్రీకాంత్‌లపైనే ఆశలు

ధోని సంగతి తెలీదు కానీ...

అంతా పీడకలలా అనిపిస్తోంది

వీధి రౌడీలా కాదు హీరోలా...

అదృష్టం మా వైపు ఉంది!

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

బౌండరీలు కూడా సమానమైతే?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

ఆ విషయంలో ఇండియాదే పైచేయి.. కానీ!

టామ్‌ లాథమ్‌ నయా రికార్డు

హిమాన్షు, నమితలకు టైటిల్స్‌

ప్రణవ్‌ రామ్‌కు సింగిల్స్‌ టైటిల్‌

హీరో.. విలన్‌.. గప్టిలే!

ఇదొక చెత్త రూల్‌: గంభీర్‌

జీవితాంతం కేన్‌కు క్షమాపణలు చెప్తాను : స్టోక్స్‌

‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

యుద్ధానికి సిద్ధం

వసూళ్లు పెరిగాయి

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు