నేడే బీసీసీఐ ఏజీఎం

1 Dec, 2019 09:57 IST|Sakshi

గంగూలీ అధ్యక్షతన జరుగనున్న తొలి సమావేశం  

ముంబై: బీసీసీఐ నూతన అధ్యక్షునిగా భారత జట్టు మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఎన్నికైన తర్వాత తొలిసారిగా నేడు జరుగనున్న బీసీసీఐ సర్వ సభ్య సమావేశం (ఏజీఎం)పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గంగూలీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో లోధా కమిటీ సిఫార్సులైన రెండు పదవుల మధ్య విరామం (కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌), క్రికెట్‌ సలహాదారుల కమిటీ (సీఏసీ), ఐసీసీలో బోర్డు ప్రతినిధి నియామకం తదితర కీలక అంశాలపై చర్చ జరుగనున్నట్లు సమాచారం.

క్రికెట్‌లో నూతన సంస్కరణలపై దష్టి సారించిన ‘దాదా’ బోర్డు రాజ్యాంగంలో సవరణలు చేసే యోచనలో ఉన్నాడు. దీని ప్రకారం బీసీసీఐ, రాష్ట్ర సంఘాల్లో వేర్వేరుగా ఆరేళ్ల పదవీకాలం పూర్తయ్యాకే కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌ను వర్తింపచేయడంపై చర్చించనున్నారు. ఈ అంశంపై ఏజీఎంలో మద్దతు లభిస్తే ఇది అమలు కానుంది. ఇదే జరిగితే బోర్డు అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా పదవీ కాలం పెరుగుతుంది.  

మరిన్ని వార్తలు