రోహిత్‌ శర్మకు షాక్‌..

18 Jul, 2018 15:52 IST|Sakshi

ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కానీ టీమిండియా ఓపెనర్ రోహిత్‌ శర్మకు ఊహించని షాక్‌ తగిలింది. తొలి మూడు టెస్ట్‌లకు సెలక్షన్‌ కమిటీ రోహిత్‌ను ఎంపిక చేయలేదు. గాయంతో దూరమైన టీమిండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాను జట్టులోకి తీసుకున్నారు. యోయో టెస్టు విఫలమవడంతో వన్టే, టీ20 సిరీస్‌లకు దూరమైన పేసర్‌ మహ్మద్‌ షమీ పునరాగమనం చేశాడు. బుమ్రా జట్టులోకి రావడంతో టీమిండియాకు బౌలింగ్‌ విభాగంలో మరింతగా బలపడనుంది. యువ ఆటగాళ్లైన రిషబ్‌ పంత్‌, కరుణ్‌ నాయర్‌, కుల్దీప్‌ యాదవ్‌, శార్దూల్‌లకు జట్టులో స్థానం లభించింది.

యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌పంత్‌, పేసర్‌ శార్దుల్‌ ఠాకూర్‌లను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. దీంతో ఈ సిరీస్‌ ద్వారా యువ ఆటగాళ్లు టెస్టులో అరంగ్రేటం చేయనున్నారు. ఆగస్టు 1వ తేదీన ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌-ఇంగ్లండ్‌ల మధ్య తొలి టెస్టు జరగనుంది. ప్రతిష్టాత్మకమైన సిరీస్‌ కావడంతో 18 మందితో భారత జట్టును ప్రకటించినట్లు తెలుస్తోంది. కోహ్లి సేన మంగళవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో 8 వికెట్లతో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయిన విషయం విదితమే. 

మొదటి మూడు టెస్టుల జట్టు : విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌, పుజారా, రహానే(వైఎస్‌- కెప్టెన్)‌, కరుణ్‌ నాయర్‌, కార్తీక్(వికెట్‌ కీపర్‌)‌, రిషబ్‌ పంత్(వికెట్‌ కీపర్)‌, అశ్విన్‌, జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, హర్దిక్‌ పాండ్య, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ, ఉమేష్‌ యాదవ్‌, బుమ్రా, శార్దుల్‌ ఠాకూర్‌.
 

మరిన్ని వార్తలు