‘పేటీఎం’కే టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌

22 Aug, 2019 05:03 IST|Sakshi

నాలుగేళ్ల కాలానికి రూ.326.80 కోట్లు

ముంబై: భారత్‌లో జరిగే అన్ని క్రికెట్‌ మ్యాచ్‌ల టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కులను ప్రముఖ డిజిటల్‌ వాలెట్‌ సంస్థ ‘పేటీఎం’ తిరిగి దక్కించుకుంది. స్వదేశంలో భారత జట్టు ఆడే అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లతో (టెస్టులు, వన్డేలు, టి20లు) పాటు మహిళల క్రికెట్‌ సహా బీసీసీఐ నిర్వహించే దేశవాళీ టోర్నీలు అన్నింటికీ ‘పేటీఎం’ టైటిల్‌ స్పాన్సర్‌గా ఉంటుంది. స్పాన్సర్‌షిప్‌పై ‘పేటీఎం’ యాజమాన్యం వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో 2019–2023 మధ్య నాలుగేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇందు కోసం ‘పేటీఎం’ రూ.326.80 కోట్లు చెల్లించ నుంది. భారత్‌లో జరిగే మ్యాచ్‌ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే సుమారుగా ఒక్కో మ్యాచ్‌కు పేటీఎం రూ. 3.80 కోట్లు చెల్లిస్తుంది. గత ఏడాది రూ. 2.4 కోట్లతో పోలిస్తే ఇది 58 శాతం ఎక్కువ. సెప్టెంబర్‌ 15న దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టి20తో భారత్‌ స్వదేశీ సీజన్‌ మొదలవుతుంది.  

మరిన్ని వార్తలు