జోహ్రిపై విచారణకు కమిటీ

26 Oct, 2018 05:45 IST|Sakshi
బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రి

బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపేందుకు సీఓఏ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. అలహాబాద్‌ హైకోర్టు మాజీ జడ్జి రాకేశ్‌ శర్మ, సీబీఐ మాజీ డైరెక్టర్‌ పీసీ శర్మ, ఢిల్లీ మహిళా హక్కుల సంఘం మాజీ చైర్‌పర్సన్‌ బర్ఖాసింగ్‌ ఇందులో ఉన్నారు.  ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది.

మరిన్ని వార్తలు