రెండు నెలల్లో అమలు చేయండి

10 Aug, 2016 03:06 IST|Sakshi
రెండు నెలల్లో అమలు చేయండి

బీసీసీఐకి లోధా ప్యానెల్ సూచన

 న్యూఢిల్లీ:  తమ రాజ్యాంగ సవరణలకు సంబంధించి 15 సంస్కరణలను అక్టోబర్ 15లోపు అమలు చేయాల్సిందిగా బీసీసీఐకి జస్టిస్ లోధా ప్యానెల్ సూచించింది. సుప్రీం కోర్టు తీర్పుననుసరించి సంస్కరణల అమలుపై మంగళవారం బోర్డు కార్యదర్శి అజయ్ షిర్కే.. ప్యానెల్‌తో సమావేశమయ్యారు. దీంట్లో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పాల్గొనాల్సి ఉన్నా గైర్హాజరయ్యారు. ఈనెల 25లోగా తాము అమలు చేసే సంస్కరణలపై నివేదిక ఇస్తామని షిర్కే వారికి తెలిపారు. ఒకే రాష్ట్రం ఒకే ఓటు, గరిష్ట వయస్సు ప్రతిపాదన వంటి ప్రతిపాదనలను అమలు చేయడం వల్ల వచ్చే సమస్యలపై ప్యానెల్‌తో షిర్కే చర్చించారు. అయితే సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇప్పుడేమీ చేయలేమని లోధా కమిటీ తేల్చి చెప్పినట్టు సమాచారం. అమెరికాలో విండీస్‌తో జరిగే రెండు టి20ల హక్కులను సోమవారం స్టార్ ఇండియాకు రూ.34.2 కోట్లకు బీసీసీఐ అప్పగించింది. అయితే మ్యాచ్‌ల ప్రసార హక్కుల విషయంలో మరింత పారదర్శకత పాటించాలని ప్యానెల్ సూచించింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా